Homeజిల్లాలుకామారెడ్డిAmbulance | అంబులెన్సును ఢీ కొట్టిన లారీ.. పేషెంటుకు గాయాలు

Ambulance | అంబులెన్సును ఢీ కొట్టిన లారీ.. పేషెంటుకు గాయాలు

అక్షరటుడే, గాంధారి: Ambulance ఆసుపత్రిలో చికిత్స పొంది, సురక్షితంగా ప్రయాణించాలని అంబులెన్సులో అంబులెన్సులో వస్తున్న పేషెంటుకు మరో ప్రమాదం జరిగింది.

సదరు అంబులెన్సును వెనుక నుంచి ఓ లారీ ఢీకొంది. దీంతో ఇంటికి వెళ్లాల్సిన పేషెంటు మళ్లీ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది.

ఈ ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district గాంధారి మండలం Gandhari mandal లో చోటుచేసుకుంది.

Ambulance | నిమ్స్​లో చికిత్స

వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడకు చెందిన వ్యక్తి కాలు విషయమై హైదరాబాద్​ Hyderabad నిమ్స్ NIMS ​లో గత ఇరవై రోజులుగా చికిత్స అందుకుని అంబులెన్సులో తన తండ్రితో కలిసి బయలుదేరాడు.

కాగా, గాంధారి మండలం తిమ్మాపూర్​ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సును వెనుక నుంచి ఓ లారీ ఢీకొంది. లారీ lorry ఢీకొన్న ధాటికి అంబులెన్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది.

దీంతో అందులోని పేషెంటుతోపాటు అతడి తండ్రి, అంబులెన్సు డ్రైవరు గాయపడ్డారు. అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.