అక్షరటుడే, వెబ్‌డెస్క్: Republic Day Sale | అమెజాన్ (Amazon) నూతన సంవత్సరంలో తొలి సేల్ నిర్వహించనుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో షాపింగ్ లవర్స్ ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన తేదీలను సంస్థ ప్రకటించింది. సేల్ జనవరి 16న ప్రారంభం కానుంది. అయితే ఎన్ని రోజులు సేల్ ఉంటుందన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు.
స్మార్ట్‌ఫోన్‌లు (Smartphones), ల్యాప్‌టాప్‌లు, టీవీలతోపాటు ఫ్యాషన్, వంటగది ఉత్పత్తులు తదితర వాటిపై భారీ తగ్గింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్‌లు, నోకాస్ట్ ఈఎంఐ, లిమిటెడ్ పిరియడ్ డీల్స్ ఉండనున్నాయి.
Republic Day Sale | ఆఫర్లు, ప్రత్యేక డీల్స్..
స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, టాబ్లెట్‌లు, కెమెరాలు, ఆడియో డివైజెస్ (Audio Devices), ఫ్యాషన్, పాదరక్షలు, బ్యూటీ ప్రొడక్ట్స్, గృహ, వంటగది సంబంధిత ఉపకరణాలు, ఆటో ఉపకరణాలు, హెల్త్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్, అమెజాన్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. వేలాది ఉత్పత్తులపై బ్లాక్‌బస్టర్ డీల్స్ (Blockbuster Deals), ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, 8 పీఎం డీల్స్, ట్రెండిరగ్ డీల్స్ వంటివి ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ సేల్‌లో ప్రధానంగా ఐక్యూ, వన్‌ప్లస్, సాంసంగ్, షావోమీ, ఆపిల్, సోనీ, టీసీఎల్, ఎల్‌జీ, హెచ్‌పీ, బోట్ తదితర ప్రధాన బ్రాండ్ల ఉత్పత్తులను డిస్కౌంట్‌లో అందించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే కొనుగోళ్లకు 10 శాతం వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. ఆఫర్లను త్వరలోనే రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
