అక్షరటుడే, వెబ్‌డెస్క్ : WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది వాట్సాప్ ఉపయోగిస్తారు. ఈ మెసేజింగ్ యాప్ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్త ఫీచర్లు తీసుకు వస్తుంది.
ప్రజలను ఆకట్టుకునేలా ఫీచర్లను తీసుకువస్తుంది వాట్సాప్ (WhatsApp). ఇప్పటికే అనేక కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా ట్రాన్స్లేషన్ ఫీచర్ (Translation Feature) విడుదల చేసింది. దీంతో ఇతర భాషల సందేశాలను యాప్‌లోనే ట్రాన్స్లేషన్ చేసుకోని సులువుగా చదవొచ్చు. ఇతర భాషలకు చెందిన వారితో చాటింగ్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
WhatsApp | 19 భాషలు
వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్ వివరాలను తాజాగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్ వ్యక్తిగత చాట్, గ్రూప్ చాట్, ఛానళ్లలోనూ ఉపయోగించుకునే వీలుంది. ప్రస్తుతానికి ఈ ట్రాన్స్‌లేషన్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో (Android Smartphones) ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, రష్యన్, అరబిక్, పోర్చుగీస్ భాషలను సపోర్టు చేస్తుంది. ఆయా భాషల సందేశాలను మాత్రమే అనువదించే వీలుంది. iOSలో ఏకంగా 19 భాషలను సపోర్టు చేస్తుందని తెలిపింది. మున్ముందు మరిన్ని భాషలకు వర్తింపజేస్తామని ప్రకటించింది.
WhatsApp | ఎలా ఉపయోగించాలంటే..
ఈ ఫీచర్‌ను ఉపయోగించాంటే.. మనకు వచ్చిన మెసేజ్‌పై ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు పైన మూడు డాట్లు కనిపిస్తాయి. దానిపై నొక్కి ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎంపిక చేసిన భాషల నుంచి సందేశాలు ట్రాన్స్‌లేట్ అవుతాయి. కావాలంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అప్పుడు అవతలి వారు ఏ భాషలో పంపినా మనకు కావాల్సిన భాషలో మెసేజ్‌లు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో ఆరు భాషలను మాత్రమే అనువదించే అవకాశం ఉంది.