Alumni Reunion
Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అక్షరటుడే,కోటగిరి: Alumni Reunion | పోతంగల్ (Pothangal) మండల జడ్పీహెచ్ఎస్ (Pothangal ZPHS) 1997-98 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. స్థానిక సాయిబాబా మందిరం (Sai Baba Temple) ఫంక్షన్ హాల్​లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యనేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ, ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో గురువులు, రామ్ రెడ్డి, శ్రీరాములు, మహేందర్, శ్రీకర్, వినోద్, సునీల్, శారద, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.