అక్షరటుడే, ఇందూరు: Inter Practicals | ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో (Qilla Boys Junior College) సీఎస్లతో సమావేశం నిర్వహించారు.
Inter Practicals | జిల్లావ్యాప్తంగా 57 కేంద్రాలు..
ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు విడతల వారీగా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 57 పరీక్ష కేంద్రాలను (examination centers) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ పని చేయాల్సి ఉంటుందన్నారు.
Inter Practicals | విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి..
పరీక్ష కేంద్రాలు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రవికుమార్ సూచించారు. ప్రయోగ పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు కౌసర్ పాషా, నూస్రత్ జహాన్, రజియా సుల్తానా, ప్రిన్సిపాళ్లు చిన్నయ్య, బుద్దిరాజ్ తదితరులు పాల్గొన్నారు.