Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

Kamareddy SP | పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: Kamareddy SP | వరద కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్నివసతులు కల్పించాలని కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) అధికారులను ఆదేశించారు.

మండలంలోని బొగ్గు గుడిసె (Boggu Gudise) ప్రాంతాన్ని ఎస్పీ రాజేశ్‌ చంద్ర శుక్రవారం సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు బొగ్గుగుడిసె ప్రాంతం అతలాకుతలమైంది. పలు వ్యాపార సముదాయాలు వరదనీటిలో మునిగిపోయాయి.

ఈ మేరకు ఎస్పీ నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోర్గల్‌ గేట్‌ (Gorgal Gate) వద్ద ఉన్న పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న మర్పల్లి గ్రామస్థులను పరామర్శించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF) సేవలను అభినందించారు. ఆయన వెంట డీఎస్పీ విఠల్‌రెడ్డి (DSP Vittal reddy), సీఐలు తిరుపతయ్య, రాజారెడ్డి, నిజాంసాగర్‌ ఎస్సై శివకుమార్‌ ఉన్నారు. అనంతరం డోంగ్లీ మండలంలోని సిర్పూర్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు.

Must Read
Related News