అక్షరటుడే, వెబ్డెస్క్: CPGET 2025 | తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (Telangana Common Postgraduate Entrance Test)(టీజీ సీపీగెట్) ఫైనల్ ఫేజ్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కన్వీనర్ పాండురంగా రెడ్డి తుది దశ ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ధృవపత్రాల వెరిఫికేషన్ ఈ నెల 29 నుంచి నవంబర్ 1 వరకు చేసుకోవచ్చు. వెరిఫికేషన్ వివరాలను కరెక్షన్ చేసుకోవాడనికి నవంబర్ 2న అవకాశం ఉంది. నవంబర్ 2 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్ల ఎంచుకోవాలి. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ కోసం నవంబర్ 5న అవకాశం కల్పించారు. నవంబర్ 9న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 11 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

