అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు (Heavy Rains) పడుతాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ధ్రోణి ప్రభావంతో వానలు పడుతాయన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు పడే ఛాన్స్ ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం, రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
Weather Updates | బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బుధవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలలో భారీ వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.
Weather Updates | అన్నదాతలు జాగ్రత్త
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. గత రెండు రోజులుగా వరుణుడు రైతులతో దోబూచులాట ఆడుతున్నారు. అప్పటి వరకు ఎండగా ఉండి.. ఒక్కసారిగా వర్షం పడుతోంది. దీంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్నారు. అన్నదాతలు ధాన్యం ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో వర్షాలు పడుతుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వానలు పడుతుండటంతో వడ్లు తడిసి పోతున్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల (Paddy Purchace centers)ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.