అక్షరటుడే, వెబ్‌డెస్క్:Airtel | ప్రస్తుతం దేశంలో జియో(Jio), ఎయిర్ టెల్(Airtel), వీఐ(VI), బీఎస్ఎన్ఎల్ టెలికాం(BSNL Telecom) కంపెనీలు ఉన్నాయి. ఇందులో యూజర్ల పరంగా జియో అగ్రస్థానంలో ఉండగా.. ఎయిర్టెల్ రెండోస్థానంలో ఉంది. అయితే యూజర్లు ఎక్కువగా ఉన్న జియో కంటే.. ఎయిర్టెల్ అధిక లాభాలు సంపాదించడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఒక్కో యూజర్‌పై ఎయిర్ టెల్ పొందే అధికంగా ఉండటమే.
ప్రస్తుతం జియోకు 470 మిలియన్ల సబ్స్క్రైబర్లు, ఎయిర్‌టెల్‌కు 390 మిలియన్ల సబ్స్క్రైబర్ల ఉన్నారు. మార్కెట్ షేరు పరంగా జియో 41శాతం వాటా కలిగి ఉండగా.. ఎయిర్టెల్ 34శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. అయితే ఎయిర్టెల్ ఒక్కో యూజర్ నుంచి నెలకు సగటున రూ. 245 ఆర్జిస్తుండగా.. జియోకు ఇది రూ. 206గా ఉంది. దీంతోనే యూజర్లు తక్కువగా ఉన్న ఎయిర్టెల్ ఆదాయం ఎక్కువగా నమోదు అయింది. ఆ సంస్థ రూ.1,72,985 కోట్ల రెవెన్యూ జనరేట్ చేయగా.. జియో రూ.1,50,270 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కాగా ఎయిర్టెల్ కస్టమర్లు(Airtel customers) నెలకు సగటున 24.5 జీబీ డాటా వినియోగిస్తుండగా.. జియో యూజర్లు 32.15జీబీ డాటా వాడుతున్నారు.
