Homeటెక్నాలజీAirtel DTH | ఎయిర్‌టెల్ ధమాకా ఆఫర్..రూ.399కే బ్రాండ్‌బ్యాండ్+ డీటీహెచ్‌

Airtel DTH | ఎయిర్‌టెల్ ధమాకా ఆఫర్..రూ.399కే బ్రాండ్‌బ్యాండ్+ డీటీహెచ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Airtel DTH | ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్), బ్రాండ్‌బ్యాండ్‌(Broadband) సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్‌ ద్వారా ఓవైపు డేటాతోపాటు మరోవైపు డీటీహెచ్‌(DTH) ప్రయోజనాలు, ఇంకోవైపు ల్యాండ్‌ లైన్‌ నుంచి అపరిమిత కాల్స్‌ సదుపాయాలు కల్పించింది.దేశంలో డిజిటల్ వినోదానికి(Digital entertainment) క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా 2 వేల నగరాలలో ఐపీటీవీ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

వినియోగదారులను ఆకర్షించేందుకు తాజాగా తన ఎంట్రీ లెవల్‌(Entry level) బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌ను సవరించింది. రూ. 399 కే బ్రాడ్‌ బ్యాండ్‌తోపాటు ఐపీటీవీ( IPTV) సేవలను అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఐపీటీవీ ప్లాన్ల ధరలు రూ. 699 నుంచి ప్రారంభం అవుతుండగా.. ఇకపై రూ. 399 నుంచే (జీఎస్టీ అదనం) లభించనున్నాయి. ఈ ప్లాన్‌పై 10 ఎంబీపీఎస్‌(Mbps) వరకు వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు లభిస్తాయి. ఎఫ్‌యూపీ (3,300 జీబీ వరకు) పరిమితి తర్వాత ఇంటర్నెట్‌ వేగం 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్‌లో 260 టీవీ ఛానెళ్లు ఉచితంగా అందుతాయి. అయితే ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌లో ఎలాంటి ఓటీటీ(OTT) ప్రయోజనాలు ఇవ్వలేదు. తక్కువ బడ్జెట్‌లో IPTVని వీక్షించాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Airtel DTH | కొత్త కనెక్షన్‌ కావాలంటే..

కొత్త కనెక్షన్‌ తీసుకోవాలనుకునే వారు రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని రాబోయే బిల్లింగ్‌ సైకిల్‌లలో సర్దుబాటు చేస్తారు. హార్డ్‌వేర్‌ ఇన్‌స్టాలేషన్‌కు ఎలాంటి రుసుములూ చెల్లించనక్కర్లేదు. ఎక్కువ వేగంతో కూడిన డేటా, ఓటీటీ ప్రయోజనాలు(OTT Benefits) కావాలంటే రూ.699, రూ.899, రూ.1,199, 1,599 (జీఎస్టీ అదనం) వంటి ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్లాన్లను బట్టి ఓటీటీ ప్రయోజనాలుంటాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ బ్లాక్ కొన్ని నగరాలకే పరిమితమైంది. కనెక్షన్‌ కావాలనుకునేవారు ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌లో కాని, రిటైల్‌ ఔట్‌లెట్‌లలోగాని సంప్రదించాలి.