అక్షరటుడే, పెద్ద కొడప్‌గల్: Pedda Kodapgal | పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న పెద్ద కొడప్‌గల్ మండల అధ్యక్షురాలు ఇందిరమ్మను ఏఐసీసీ అబ్జర్వర్ రాజాపాల్ కరోలా (AICC Observer Rajapal Karola ) సన్మానించారు. డీసీసీ అధ్యక్ష ఎంపికలో భాగంగా శుక్రవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో (Nizamsagar Mandal Center) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మను శాలువాతో సత్కరించారు. పెద్ద కొడప్‌గల్ మండల (Pedda Kodapgal Mandal) కాంగ్రెస్ నాయకులు.. డీసీసీ అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్‌ను నియమించాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు శ్యామప్ప, మల్లప్ప పటేల్, మొగులా గౌడ్, డాక్టర్ సంజీవ్, ప్రహ్లాద్ పటేల్, మష్ను పటేల్, పండరి, సంతోష్ దేశాయ్, జాగోర్, తదితరులు పాల్గొన్నారు.