అక్షరటుడే, వెబ్‌డెస్క్: AICC Leaders Meeting | ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో విజయంపై రాష్ట్ర నేతలను వారు అభినందించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (AICC Secretary KC Venugopal), కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) సైతం పాల్గొన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం, రాష్ట్రంలో పాలనపై వారు చర్చించారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చ జరిగినట్లు సమాచారం.
AICC Leaders Meeting | అందరికీ న్యాయం
తెలంగాణ నేతలతో భేటీపై మల్లికార్జున్ ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం తర్వాత, ప్రజా తెలంగాణ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి నాయకులు మంత్రులతో సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం తమ లక్ష్యమన్నారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి సమగ్రమైన తెలంగాణను నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రులు పాల్గొన్నారు.