అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | ఎల్లారెడ్డి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు వసతుల్లేక అవస్థలు పడుతున్నారని, వారి కష్టాలు తీర్చాలని మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Former MLA Nallamudugu Surender) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కస్తుర్బా పాఠశాలను (Kasturba school) సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు.
కస్తూర్బాలో అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఫోన్ చేయడంతో ఆయన పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలోని తాగునీరు (drinking water), భోజనాన్ని పరిశీలించారు. వంట కోసం వాడుతున్న నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ గెలిచాక అమెరికాలో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో ఫోజ్లకు తప్ప నియోజకవర్గంలోని విద్యాసంస్థలపై ఆయనకు అవగాహన లేదన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి నియోజకవర్గంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో పర్యటించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.