అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ghaziabad Suicide Case | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. కొరియన్ ఆన్లైన్ గేమ్‌కు బానిసలుగా మారి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఘజియాబాద్‌లో ముగ్గురు బాలికలు మంగళవారం అర్ధరారతి ఒక భవనంలోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలం నుండి ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది, అందులో ముగ్గురు సోదరీమణులు “సారీ మమ్మీ, సారీ పాపా…” అని రాశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బాలికలు ఆన్లైన్ కొరియన్ గేమ్ (Korean Game) ఆడటానికి బానిసలు అయ్యారు. మంగళవారం గేమ్ చివరి టాస్క్. చివరి టాస్క్ పూర్తి చేసిన తర్వాత వారు 9వ అంతస్తు నుండి దూకారు. దీంతో పోలీసులు బాలికల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గేమ్‌లో మొత్తం 50 టాస్క్‌లు ఉన్నాయి.
Ghaziabad Suicide Case | అన్ని పనులు కలిసే..
మృతి చెందిన బాలికలను పాఖీ (12), ప్రాచి (14), విశిక (16)గా గుర్తించారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు అన్ని పనులు కలిసే చేసేవారు. కొవిడ్ అనంతరం వీరు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు మారినట్లు వారి తండ్రి తెలిపారు. సమాచారం అందుకున్న షాలిమార్ గార్డెన్ఏసీపీ (Shalimar Garden ACP) అతుల్ కుమార్ సింగ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఆ బాలికలు తమకు తామే కొరియన్ పేర్లను పెట్టుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గేమ్‌లో భాగంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆ బాలికలు బడికి కూడా సక్రమంగా హాజరు అయ్యేవారు కాదని పోలీసులు గుర్తించారు. ఆ బాలికలు తమ తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ సూసైడ్ నోట్ రాశారు.