అక్షరటుడే, వెబ్‌డెస్క్ :ACB Trap | ఏసీబీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో నిత్యం తనిఖీలు చేపడుతూ అవినీతి అధికారుల అంతు చూస్తోంది. ప్రజలు కూడా అవినీతి అధికారులపై ఫిర్యాదులు చేస్తుండటంతో ఏసీబీ దాడులు(ACB Raids) చేస్తూ.. అక్రమార్కుల భరతం పడుతోంది. శుక్రవారం ఒక్క రోజే మూడు ఘటనల్లో ఏసీబీ అధికారులు నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు.
ACB Trap | రూ.8 లక్షల లంచం డిమాండ్
ఒక వ్యక్తికి సంబంధించిన రెండు భవనాలకు ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్‌రావు(Vitthal Rao) రూ.8 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.4 లక్షలు గతంలోనే తీసుకున్నాడు. శుక్రవారం మరో రూ.4 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Trap | ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల ఇన్‌ఛార్జి ఎంపీడీవో విఠల్‌రెడ్డి(Incharge MPDO Vithal Reddy) లంచం తీసుకుంటూ చిక్కాడు. సీసీ కాలువ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ మంజూరైన బిల్లు చెక్కు అందించడానికి రూ.15 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ(ACB)ని ఆశ్రయించాడు. ఈ క్రమంలో శనివారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB Officers) పట్టుకున్నారు.
ACB Trap | కామారెడ్డిలో ఇద్దరు..
కామారెడ్డి పోలీస్ స్టేషన్(Kamareddy Police Station)లో నమోదైన ఒక కేసుకు సంబంధించి విచారణను త్వరగా పూర్తి చేసి, నిర్దోషిగా విడుదల చేయడానికి లంచం అడిగిన ఇద్దరిని ఏసీబీ పట్టుకుంది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివరామ్ నాయక్(Gugulot Ashok Shivaram Nayak), కానిస్టేబుల్ నిమ్మ సంజయ్(Constable Nimma Sanjay) నిందితుడిని రూ.15 వేల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని ఆయన చెప్పడంతో రూ.10 వేలకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో శనివారం లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు(ACB Officers) పట్టుకున్నారు. అనంతరం ఏపీపీ, కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.