అక్షరటుడే, ఇందూరు: Eapcet results | కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు తొలి ప్రయత్నంలో ఈఏపీసెట్‌లో తమ సత్తా చాటారు. అన్సార్ అలీ 1,766వ ర్యాంకుతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల ఛైర్పర్సన్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్‌తో పాటు తొలి ప్రయత్నంలోనే పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. సంకీర్త్ 2,398, వేదాక్షర్ 2,881, భవ్యశ్రీ 3,310, లోకేష్ 3,671, వైష్ణవి 4,172, రిషిక్ 5,932, నికేతన్ 6,293 ర్యాంకులు సాధించారు. విద్యార్థులను డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ సందీప్, రణదీష్ శర్మ, తదితరులు అభినందించారు.
