అక్షరటుడే, వెబ్‌డెస్క్: Abhishek Sharma Three Ducks | టీ20 వరల్డ్ కప్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి పరుగు కోసం ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో డక్ అవుట్ అయిన అతడు, బుధవారం అహ్మదాబాద్ (Ahmedabad)లో నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో కూడా జీరోకే ఔటయ్యాడు.
ఓపెనింగ్ ఓవర్లో వేసిన మూడో బంతిని పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బంతి స్కిడ్ అయి స్టంప్స్‌ను తాకింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ సిరాజ్ జెర్సీ ధరించడం గమనార్హం. అయితే అదృష్టం మాత్రం అతనికి కలిసిరాలేదు.
Abhishek Sharma Three Ducks | అభిషేక్ చెత్త రికార్డ్..
మూడు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు డక్స్ నమోదు చేయడంతో, టీ20 వరల్డ్ కప్‌లలో భారత్ తరఫున అత్యధిక డక్స్ సాధించిన ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఈ రికార్డును మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తో కలిసి పంచుకున్నాడు. మొత్తం టోర్నీ చరిత్రలో చూస్తే, పాకిస్థాన్ దిగ్గజం షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi )(34 మ్యాచ్‌లు) , శ్రీలంక లెజెండ్ దిల్షాన్ (Tillakaratne Dilshan) (35 మ్యాచ్‌లు) చెరో ఐదు డక్స్‌తో టాప్‌లో ఉన్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మాట్లాడుతూ, “ఆత్మవిశ్వాసమే ముఖ్యమైనది. అతడు న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ క్రీజ్‌లో సెట్ అయ్యాకే రిస్క్ తీసుకోవాలి. అత్సుత్సాహం అవసరం లేదు. అభిషేక్ వద్ద ఉన్న ప్రతిభను మనం ఇప్పటికే చూశాం” అని వ్యాఖ్యానించాడు. అయితే ఈ టోర్నీలో స్పిన్ బౌలింగ్ భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతోంది. ముందుగా నమీబియా కెప్టెన్, అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లు Usman Qadir, Saim Ayub స్పిన్‌తో ఒత్తిడి సృష్టించారు. ఇప్పుడు నెదర్లాండ్స్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్ కూడా భారత స్టార్ బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేశాడు. మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో స్పిన్నర్లపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినప్పటికీ, ఇంకా మెరుగుదల అవసరమని స్పష్టమైంది. నెదర్లాండ్స్ పేసర్లు కూడా తమ వేరియేషన్లతో భారత బ్యాటర్లను పరీక్షించారు. గత రాత్రి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.