అక్షరటుడే, వెబ్డెస్క్: Aamir Khan | ఈ రోజుల్లో సెలబ్రిటీలు చేస్తున్న పనులు అందరిని ఆశ్చర్యింపజేస్తున్నాయి. నటీనటులు, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు (celebrities) అప్పుడప్పుడూ గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇంకొందరు సినిమా ప్రమోషన్స్ కోసం విచిత్రంగా ప్రవర్తించడం కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ నటుడు (Bollywood star actors) ఈ మధ్య చేస్తున్న చేష్టలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో రోడ్లపై బిక్షగాడిలా మారువేశమేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన సినిమా ప్రమోషన్ల (Promotions) కోసమే ఇలా వింతగా ప్రవర్తించాడని తెలిసి ఫ్యాన్స్ నోరెళ్ల బెట్టారు. ఇప్పుడు కూడా తన అప్ కమింగ్ సినిమా ప్రమోషన్ కోసం రోడ్లపై వడపావ్ Ivadapav) అమ్ముతున్నాడు.
Aamir Khan | ఇదేంది లా…
ఇంతకు ఎవరా హీరో అనేదే కదా మీ డౌట్. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ (Aamir Khan). ఆయన గత చిత్రాలు ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు ఆమిర్ (Aamir khan). ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడు. ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించిన క్రమంలో ప్రమోట్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ముంబై వీధుల్లో వడ పావ్ అమ్మాడీ స్టార్ హీరో.’సితారే జమీన్ పర్’లో ఆమిర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్ (Genelia Deshmukh) తదితరులు నటించారు. ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. దీంతో ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు.
ప్రమోషన్స్ లో భాగంగా ఆమీర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో కలిసి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఇది ఒక సూపర్ హీరో కథాంశంతో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ 2026లో ప్రారంభం కానుంది. అమీర్ ఖాన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
https://www.instagram.com/reel/DKlxFeNPDd0/?utm_source=ig_web_copy_link