అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ (DGP) ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు వ్యాపారులు, సినీ ప్రముఖులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా.. ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (SIB Chief Prabhakar Rao)ను ఇటీవల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా ఈ కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేయడం గమనార్హం.
Phone Tapping Case | సీపీ సజ్జనార్ నేతృత్వంలో..
హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ (Commissioner Sajjanar) పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు అయింది. సిట్ బృందం సమగ్ర దర్యాప్తు జరిపి, వీలైనంత త్వరగా చార్జిషీట్‌ను దాఖలు చేయనుంది. ఈ బృందంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్ఎం. విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ నుంచి రవీందర్‌రెడ్డి, రాజేంద్ర నగర్ అదనపు డీసీపీ కెఎస్ రావు జూబ్లీహిల్స్ ఏసీపీ, ప్రస్తుత కేసు దర్యాప్తు అధికారి వెంకటగిరి, టీజీఏఎన్‌బీ డీఎస్పీ శ్రీధర్, హెచ్ఎంఆర్ఎల్ డీఎప్పీ నాగేందర్ రావు సభ్యులుగా ఉంటారు.
Phone Tapping Case | 21 నెలల తర్వాత..
ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన 21 నెలల తర్వాత సిట్ ఏర్పాటు చేయడం గమనార్హం. దీంతో రానున్న రోజుల్లో కేసులో అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆయన విచారణకు సహకరించడం లేదు. దీంతో త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రణీత్‌రావు (Praneeth Rao) గతంలోనే అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్‌రావు విచారణ అనంతరం అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ విశ్రాంత డీసీపీ రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్‌రావును గతంలో అరెస్ట్ చేశారు.