అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP CM Chandrababu | కుప్పం (Kuppam) నుంచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూంపించామని తెలిపారు.
కుప్పంలో శనివారం చంద్రబాబు ఇ–సైకిళ్లను (E-Cycles) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మూడు కిలోమీటర్లు ఇ–సైకిల్‌పై ప్రయాణించి ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఇ- సైకిళ్ల పంపిణీ చేపట్టారు. దీంతో చిత్తూరు జిల్లా (Chittoor District) గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తూనే ఉంటామన్నారు. తప్పు చేసిన వాళ్లకు నిద్ర రాదని, వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయని పేర్కొన్నారు. మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుందన్నారు.
AP CM Chandrababu | సైకిళ్ల ప్రత్యేకత
ఇ-సైకిళ్లను కూటమి ప్రభుత్వం రాయితీపై ప్రజలకు అందిస్తోంది. పర్యావరణ హితం కోసం వీటిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-మోటోరాడ్స్ (E-Motorads) అనే సంస్థ వీటిని రూపొందించింది. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్తాయి. వీటి ధర రూ.35 వేలు ఉండగా.. ప్రభుత్వం రూ.10 వేలు రాయితీ ఇస్తోంది. దీంతో రూ.25 వేలకు వీటిని పొందవచ్చు. చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పంలో 5,555 ఇ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామన్నారు.