అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Junior Assistant caught by acb | అవినీతి అధికారులు మారడం లేదు. ఏసీబీ దాడులు చేపడుతున్నా.. లంచాలకు మరిగిన వారు భయపడటం లేదు. కొందరు అయితే లంచం తీసుకోవడం (taking bribes) కూడా తమ హక్కుగా భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని (Hyderabad city) బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల జాబితా నుంచి ఒక పాఠశాలను తీసివేయకుండా ఉండటానికి జూనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో పాఠశాల యాజమాన్యం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. బుధవారం రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు (ACB officials) జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Junior Assistant caught by acb | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.