అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLA Bhupathi Reddy | ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) సూచించారు.
జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ–ఉపాధ్యాయ పురస్కారాలు–2026 (Job-Teacher Awards-2026) కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని గుర్తుచేశారు.
MLA Bhupathi Reddy | చిన్నారులకు పౌష్టికాహారం
చిన్నారులకు పౌష్టికాహారం (nutritious food), ప్రీ-ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ వర్సిటీ, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గేమ్స్, జోన్-స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు.
MLA Bhupathi Reddy | ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు
ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని భూపతిరెడ్డి అన్నారు. పదో తరగతి ఫలితాల్లో శాతానికి శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణమన్నారు. మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, మాజీ జెడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.