ePaper
More
    HomeFeaturesVivo X Fold 5 | అదిరిపోయే ఫీచర్లతో వీవో నుంచి మడతపెట్టే ఫోన్‌.. ధర...

    Vivo X Fold 5 | అదిరిపోయే ఫీచర్లతో వీవో నుంచి మడతపెట్టే ఫోన్‌.. ధర అక్షరాలా రూ. లక్షన్నర..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vivo X Fold 5 | చైనా(China)కు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వివో(Vivo) కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకువచ్చింది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 5(Vivo X Fold 5) పేరిట దీనిని విడుదల చేసింది. ఈ మోడల్‌ ఫోన్‌ ధర అక్షరాలా లక్షన్నర రూపాయలు. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..

    Display:8.03 inch అమోలెడ్‌ ఇన్నర్‌ డిస్‌ప్లే, 6.53 అంగుళాల అమోలెడ్‌ కవర్‌ డిస్‌ప్లేతో తీసుకువచ్చారు. రెండు ప్యానెల్స్‌ కూడా 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, 4,500 నిట్స్‌ లోకల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉన్నాయి.
    IP5X, IPX8, IPX9 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌, మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానం ఉంది.

    Processor: ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 gen 3 ప్రాసెసర్‌ అమర్చారు. .

    OS: ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్‌ OS 15తో పనిచేస్తుంది.

    Camera: ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.
    వెనక భాగంలో 50 ఎంపీ అల్ట్రా సెన్సింగ్‌ వీసీఎస్‌ బయోనిక్‌ (IMX921) ప్రధాన కెమెరా బిగించారు. 50 ఎంపీ జెడ్‌ఈఐఎస్‌ఎస్‌ బ్రాండెడ్‌ టెలిఫొటో (సోనీ IMX882), 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉన్నాయి. ఇది AI ఇమేజ్‌ స్టుడియో ఫీచర్లను సపోర్ట్‌ చేస్తుంది.
    ముందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 20 ఎంపీ మెదటి కెమెరా, 20 మెగా పిక్సెల్‌ రెండో కెమెరా అమర్చారు.

    Battery: 6,000 mAh బ్యాటరీ ఉంది. 80w వైర్‌డ్‌, 40w వైర్‌లెస్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

    Price: ఈ మోడల్‌ ను సింగిల్‌ వేరియంట్‌లో తీసుకువచ్చారు. 16GB + 512GB వేరియంట్‌ ధర రూ.1,49,999. ఇది టైటానియం గ్రే కలర్‌లో లభిస్తుంది.

    ఆఫర్స్‌: ఫ్లిప్‌కార్డ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో రూ. 15 వేల తక్షణ డిస్కౌంట్‌తోపాటు 5 శాతం వరకు (గరిష్టంగా రూ. 4 వేలు) క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, యస్‌బ్యాంక్‌ తదితర ‍క్రెడిట్‌ కార్డులపై 10 శాతం వరకు తక్షణ తగ్గింపు ఉంటుంది.

    Pre Booking: ఈనెల 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు వివో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...