అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka | సిగరెట్ కోసం జరిగిన గొడవ.. ఓ వ్యక్తి మృతికి కారణమైంది. చిన్న గొడవతో ఓ వ్యక్తి తన మిత్రుడిని కారుతో గుద్ది హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది.
వీరసంద్ర ప్రాంతానికి చెందిన ప్రశాంత్(33), ఆర్.పురం నివాసి రోషన్ స్నేహితులు. కమ్మసంద్ర (Kammasandra)లో ఆదివారం క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ప్రశాంత్, రోషన్ కారులో హాజరు అయ్యారు. పోటీలు ముగిశాక మిత్రులు ఇద్దరు ఓ చోట కూర్చొని మద్యం తాగారు. అనంతరం సిగరెట్ లైటర్ (Cigarette Lighter) విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది పెద్దదిగా మారడంతో ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్ర గాయం అయింది. దీంతో అతడు తన కారులో అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. ప్రశాంత్ అతడిని అడ్డుకున్నాడు. బలవంతంగా కారులోకి ఎక్కేందుకు యత్నించి డోర్ పట్టుకొని వేళాడాడు.
Karnataka | చెట్టును ఢీకొని..
ప్రశాంత్ కారు డోర్‌ను పట్టుకొని వేళాడుతున్నా.. రోషన్ కావాలని కారును వేగంగా నడిపాడు. అనంతరం చెట్టును, ప్రహరీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రశాంత్ మరణించగా.. రోషన్ సైతం గాయపడ్డారు. మొదట పోలీసులు దీనిని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో కారు డ్యాష్ బోర్డు కెమెరా (Car Dashboard Camera)లో రికార్డు అయింది. దీంతో నిందితుడు రోషన్‌ను అరెస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రశాంత్ కారును ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ రోషన్ వేగంగా కారును పోనివ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.