IPL | ఐపీఎల్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలు
IPL | ఐపీఎల్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఐపీఎల్​లో ipl మరోసారి మ్యాచ్​ ఫిక్సింగ్ match fixing on ipl​ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు ఫిక్సింగ్​కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (Rajasthan cricket association) కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. జైపూర్‌లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ ఉత్కంఠ భరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపు దిశగా సాగిన ఆర్​ఆర్​ చివరి ఓవర్లో బోల్తా పడింది.

చివరి ఓవర్లో గెలుపునకు 9 పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న ధ్రువ్​ జురేల్​, హెట్​మెయిర్​ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అద్భుతంగా బౌలింగ్​ చేసిన అవేశ్​ ఖాన్​ ఆరు పరుగులే ఇచ్చి లక్నోకు విజయం అందించాడు. అయితే మ్యాచ్​ ఫిక్సింగ్​ కారణంగానే గెలిచే మ్యాచ్​లో రాజస్థాన్​ ఓడిపోయిందని బిహానీ ఆరోపించారు. ఈ మ్యాచ్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

కాగా.. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై bcci సైతం టీమ్స్, యజమానులు, కోచ్ లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. తాజాగా మరోసారి ipl match fixing ఆరోపణలు రావడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది.