IPL | ఐపీఎల్​ మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఐపీఎల్​లో ipl మరోసారి మ్యాచ్​ ఫిక్సింగ్ match fixing on ipl​ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు ఫిక్సింగ్​కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (Rajasthan cricket association) కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. జైపూర్‌లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ ఉత్కంఠ భరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపు దిశగా సాగిన ఆర్​ఆర్​ చివరి ఓవర్లో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఐపీఎల్​లో ipl మరోసారి మ్యాచ్​ ఫిక్సింగ్ match fixing on ipl​ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు ఫిక్సింగ్​కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (Rajasthan cricket association) కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపించారు. జైపూర్‌లో ఏప్రిల్ 19న లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్​ రాయల్స్​ మధ్య మ్యాచ్​ ఉత్కంఠ భరితంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో గెలుపు దిశగా సాగిన ఆర్​ఆర్​ చివరి ఓవర్లో బోల్తా పడింది.

చివరి ఓవర్లో గెలుపునకు 9 పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న ధ్రువ్​ జురేల్​, హెట్​మెయిర్​ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. అద్భుతంగా బౌలింగ్​ చేసిన అవేశ్​ ఖాన్​ ఆరు పరుగులే ఇచ్చి లక్నోకు విజయం అందించాడు. అయితే మ్యాచ్​ ఫిక్సింగ్​ కారణంగానే గెలిచే మ్యాచ్​లో రాజస్థాన్​ ఓడిపోయిందని బిహానీ ఆరోపించారు. ఈ మ్యాచ్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన కోరారు.

కాగా.. ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై bcci సైతం టీమ్స్, యజమానులు, కోచ్ లకు కీలక హెచ్చరిక జారీ చేసింది. తాజాగా మరోసారి ipl match fixing ఆరోపణలు రావడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...