అక్షర టుడే, బాల్కొండ: Balkonda Mandal | మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని డీఎంహెచ్ఓ రాజశ్రీ (DMHO Rajshri) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉందని, దీంతో జిల్లా వైద్య శాఖ (district medical department) నుంచి మరో ఇద్దరిని నియమిస్తున్నట్లు తెలిపారు. వీరు వారంలో మూడు రోజులు ఇక్కడ విధులు నిర్వహిస్తారన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు.