Karre Guttalu | కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న బలగాలు
Karre Guttalu | కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న బలగాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్:Karre Guttalu | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​(Telangana-Chhattisgarh) సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపూర్​ సమీపంలో గల కర్రెగుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆపరేషన్ operation kagar​ కర్రెగుట్టలు పేరుతో 11 రోజుగా బలగాలు కూంబింగ్ (Combing)​ నిర్వహిస్తున్నాయి. అడవిలో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సైతం బలగాలు డ్రోన్లు, హెలీక్యాప్టర్ల సాయంతో ముందుకు వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టుల భారీ బంకర్(Maoist’s huge bunker)​ను గుర్తించారు. అయితే బలగాల రాకతో అప్రమత్తమైన మావోయిస్టులు మరో ప్రాంతానికి తరలి వెళ్లారు.

Karre Guttalu | బేస్​ క్యాంపుల ఏర్పాటు

కర్రెగుట్టుల్లోని రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అధికారులు అక్కడ ప్రస్తుతానికి బేస్​ క్యాంపు(Base Camp) ఏర్పాటు చేశారు. భారీ భద్రత, డాగ్​ స్క్వాడ్(Dog squad)​, మైన్​ డిటెక్టర్​(Mine Detector)లతో బేస్​ క్యాంపు వద్ద తనిఖీలు చేపట్టారు.

అయితే ఇంకా చాలా గుట్టలు, సొరంగాలు ఉండటంతో కూంబింగ్​ చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఆపరేషన్​ సవాల్​గా మారింది. అయినా హెలికాప్టర్లు, డ్రోన్లతో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగిస్తున్నారు. మావోయిస్టులు (Maoist’s) సేఫ్​జోన్​లోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.