ePaper
More
    Homeఅంతర్జాతీయంUS President Trump | చ‌నిపోయార‌న్న వార్త‌ల‌పై స్పందించిన ట్రంప్‌.. అవ‌న్నీ ఫేక్ న్యూస్ అని...

    US President Trump | చ‌నిపోయార‌న్న వార్త‌ల‌పై స్పందించిన ట్రంప్‌.. అవ‌న్నీ ఫేక్ న్యూస్ అని వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US President Trump | తన ఆరోగ్యం గురించి జ‌రుగుతున్న ఊహాగానాల‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అవ‌న్నీ ఫేక్ న్యూస్(Fake News) అని కొట్టి ప‌డేశారు. సోషల్ మీడియా జ‌రుగుతున్న ఊహాగానాలను తోసిపుచ్చారు. తాను ఆరోగ్యంగా, మ‌రింత ఉత్సాహంగా ఉన్నాన‌ని చెప్పారు.

    వీకెండ్‌లో చాలా ఉల్లాసంగా గ‌డిపాన‌ని తెలిపారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో తీవ్ర సంక్షోభం నెల‌కొన్న త‌రుణంలో తాను అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు సిద్ధ‌మేన‌ని ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ చ‌నిపోయార‌న్న వార్త‌ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. ఓవ‌ల్ ఆఫీస్‌(Oval Office)లో విలేక‌రుల‌తో మాట్లాడిన ట్రంప్ ఈ వార్తల‌ను కొట్టిప‌డేశారు. అవ‌న్నీ తప్పుడు ఆరోప‌ణ‌ల‌ని పేర్కొన్నారు. లేబర్ డే వీకెండ్‌లో మీడియా ఇంటర్వ్యూలు నిర్వహించడం, వర్జీనియాలోని తన గోల్ఫ్ క్లబ్‌ను సందర్శించిన‌ట్లు తెలిపారు.

    US President Trump | చురుగ్గా ఉన్నా..

    ట్రంప్ కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ ప‌డుతున్నారు. సిర‌ల వ్యాధితో పాటు మ‌రికొన్ని చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. అలాగే, గ‌తంలో మాజీ అధ్య‌క్షుడు జో బైడెన్(Former President Joe Biden) అనారోగ్యం గురించి తీవ్రంగా విమ‌ర్శించిన ట్రంప్‌.. ఇప్పుడు ఆయ‌న కూడా ప్ర‌సంగాల సంద‌ర్భంగా త‌డ‌బ‌డుతున్నారు. ఆయ‌న కుడి చేతిపై గాయం క‌నిపించ‌డం కూడా ట్రంప్ ఆరోగ్యంపై అనేక అనుమానాల‌కు తావిచ్చింది. ఈ నేప‌థ్యంలో నాలుగు రోజుల పాటు అధ్య‌క్షుడు క‌నిపించ‌క పోవ‌డంతో ఆయ‌న చ‌నిపోయార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే, వాటిని ట్రంప్(Donald Trump) కొట్టిప‌డేశారు. తన వ్యాఖ్యలలో పుకార్లకు ముగింపు పలికేందుకు ప్రయత్నించారు. “అవి చాలా తీవ్రమైన త‌ప్పుడు వార్త‌లు” అని ఆయన తన మరణ వార్తలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. “నేను విన్నాను.

    ఇది ఒక రకమైన పిచ్చి ప‌ని. గత వారం నేను అనేక వార్తా సమావేశాలు నిర్వహించాను, అన్నీ విజయవంతమయ్యాయి” అని ట్రంప్ తెలిపారు.మ‌రోవైపు, మాజీ అధ్య‌క్షుడు జో బైడెన్‌ను టార్గెట్‌గా చేస్తూ ట్రంప్ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. రెండ్రోజులు క‌నిపించ‌క పోతే తాను చ‌నిపోయిన‌ట్లు ప్ర‌చారం చేశార‌ని, మరీ మాజీ అధ్య‌క్షుడు క‌నిపించ‌కుండా పోతే ఆయ‌న గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. “మీరు అతన్ని చూడలేరు. అతనిలో ఏదైనా తప్పు ఉందని ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. అతను గొప్ప స్థితిలో లేడని మాకు తెలుసు,” అని బైడెన్‌ను ఉద్దేశించి అన్నారు.

    More like this

    Best Teacher Award | ఉమ్మడిజిల్లాలో ఉత్తమ గురువులు వీరే..

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది....

    Migraine | మైగ్రేన్ సమస్యలతకు చింతపండుతో చెక్.. ఎలాగంటారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Migraine | ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల తలనొప్పి, మైగ్రేషన్(Migraine) సమస్యలు...

    Best Teacher Award | ఉత్తమ ఉపాధ్యాయుడిగా బోర్గా(పి) జెడ్పీహెచ్​ఎస్​ హెచ్​ఎం శంకర్​

    అక్షరటుడే, ఇందూరు: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ...