ePaper
More
    HomeతెలంగాణTahsildar Transfers | పలువురు తహశీల్దార్ల బదిలీ

    Tahsildar Transfers | పలువురు తహశీల్దార్ల బదిలీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tahsildar Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) పలువురు తహశీల్దార్లను బదిలీ tahasildars transfers చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    గత అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు ఇతర జిల్లాలకు బదిలీ చేసిన తహశీల్దార్లను ఎట్టకేలకు సొంత జిల్లాలకు పంపించింది. తమను సొంత జిల్లాలకు పంపాలని కొంతకాలంగా తహశీల్దార్లు(Tahsildars transfers Telangana) కోరుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో మల్టీ జోన్​–1 పరిధిలో 55 మంది తహశీల్దార్లను, మల్టీ జోన్​–2 పరిధిలో 44 మందిని ట్రాన్స్​ఫర్​ చేసింది. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా పరిధిలో కూడా పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు.

    జగిత్యాల జిల్లాలో పని చేస్తున్న వీర్​సింగ్, ప్రసాద్, ముజిబుద్దీన్​ ​ నిజామాబాద్​కు బదిలీపై రానున్నారు. అలాగే నిజామాబాద్​ నుంచి మాలతి మెదక్​కు, మల్లయ్య సిరిసిల్లకు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కామారెడ్డిలో పని చేస్తున్న హిమబిందు నిర్మల్​కు, సతీష్​రెడ్డి నిజామాబాద్​ వెళ్లనున్నారు. నిర్మల్​ పనిచేస్తున్న జానకి, పెద్దరాజు కామారెడ్డి రానున్నారు. నిజామాబాద్​లో పని చేస్తున్న నాగరాజ్​కు జగిత్యాలకు, ప్రభాకర్​, గజానన్​ నిర్మల్​కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు. శ్రీనివాస్​ నిర్మల్​ నుంచి నిజామాబాద్​కు, రహిముద్దీన్​ కామారెడ్డి నుంచి ఆసిఫాబాద్​కు, సునీత నిజామాబాద్​ నుంచి కామారెడ్డికి, ఆంజనేయులు నిజామాబాద్​ నుంచి పెద్దపల్లికి బదిలీ అయ్యారు.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...