అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Liquor shops | మద్యం షాపులకు సోమవారం 83 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 232 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) పేర్కొన్నారు.
నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 వైన్ షాప్‌లకు (wine shops) గాను 86 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ దుకాణాలకు 38 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్‌లకు 54 దరఖాస్తులు సమర్పించారు.
భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ దుకాణాలకు గాను 32 దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్‌లకు 22 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్‌లకు 232 దరఖాస్తులు వచ్చాయి.