అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy train collision | కామారెడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొన్న ప్రమాదంలో 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జీవాలు ఆదివారం రైల్వే ట్రాక్ దాటుతుండగా.. రైలు ఢీకొంది.
రైలు రాకను గమనించి గొర్రెల కాపరి సురేష్ పెద్ద వాగులోకి దూకారు. అయితే, ఆయనతో పాటు ఉన్న మరో కాపరి ధర్షపు సుధాకర్ (35) కూడా దూకారు. కానీ, ఈత రాకపోవడంతో వాగులో గల్లంతయ్యారు.
Kamareddy train collision | గాలింపు చర్యలు
సుధాకర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
