3
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lava Blaze Dragon | దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా(Lava) బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లతో 5G ఫోన్‌ను తీసుకొచ్చింది. లావా బ్లేజ్ డ్రాగన్ 5జీ(Lava Blaze Dragon 5G) పేరిట దీనిని లాంచ్ చేసింది. ఆగస్టు 1 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా..
- 6.74 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేటు, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W వైర్డ్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
- Snapdragon 4 Gen 2 (4nm) చిప్సెట్ కలిగి ఉంటుంది.
- Android 15 క్లీన్ వర్షన్.. బ్లోట్‌వేర్ లేని UI.
- ఏడాది వరకు ఓఎస్(OS) అప్డేట్స్, రెండేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అందిస్తామని కంపెనీ ప్రకటించింది. అలాగే ఇంటి దగ్గరే సర్వీస్ అందిస్తామని పేర్కొంది.
- వెనకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి.
దీనిని సింగిల్ వేరియంట్(Single variant)లో తీసుకువచ్చారు. 4 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 9,999. గోల్డెన్ మిస్ట్, మిడ్నైట్ మిస్ట్ కలర్స్‌లో లభిస్తుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సందర్భంగా వెయ్యి రూపాయల తక్షణ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్(Cash back) లభించనుంది.