ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై...

    IPL 2025 | ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్‌కే ఔట్.. ఆ ఐదుగురు ఆటగాళ్లపై వేటు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా తప్పుకుంది.

    ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు అధికారికంగా తప్పుకుంది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఆ జట్టుకు 8వ పరాజయం. సీఎస్‌కే మరో 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేదు. ఈ క్రమంలోనే సీఎస్‌కే వచ్చే సీజన్‌పై ఫోకస్ పెట్టింది.

    టీమ్‌కు అవసరమయ్యే ఆటగాళ్లు ఎవరు? భారంగా మారిన ప్లేయర్లు ఎవరు? అనేది తెలుసుకోవడంపై కార్యచరణ మొదలు పెట్టింది. ధోనీ కూడా వచ్చే ఏడాదికి సంబంధించిన సన్నాహకాలు మొదలు పెడుతామని ఇప్పటికే స్పష్టం చేశాడు. కుర్రాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపాడు.

    ఆపరేషన్ సీఎస్కే పేరిట.. జట్టుకు భారంగా మారిన ఐదుగురి ఆటగాళ్లపై వేటు పడనుంది. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సామ్ కరణ్‌, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లపై వేటు వేయనుంది. వారిని అప్‌కమింగ్ సీజన్ వేలం ముందు జట్టు నుంచి రిలీజ్ చేయనుంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఆరంభంలో వరుస మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇచ్చింది. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. చివరకు తుది జట్టులో చోటు కోల్పోయాడు.

    దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్‌లు సైతం జట్టుకు భారంగా మారారు. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో చెన్నై విజయవకాశాలు దెబ్బతీసారు. ఆల్‌రౌండర్ సామ్ కరణ్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ ఐదుగురి ఆటగాళ్లకు సీఎస్‌కే ఉద్వాసన పలకాలనుకుంటుంది.

    Latest articles

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    More like this