ePaper
More
    HomeజాతీయంTerror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Terror Attack | శరీరంలో 42 బుల్లెట్లు.. కిరాతకంగా చంపిన ఉగ్రవాదులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Terror Attack |కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​లో ఉగ్రదాడిలో ఉగ్రవాదుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సెలవుల్లో ఆనందంగా గడపడానికి వెళ్లిన పర్యాటకులను టెర్రరిస్టులు(Terrorists) కనికరం లేకుండా కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్​రావు​పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఆయన శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. దీనిని బట్టి టెర్రరిస్టులు ఎలా రెచ్చిపోయారో తెలుస్తుంది. కాగా మధుసూదన్​రావు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి కశ్మీర్​(Kashmir) అందాలను చూడటానికి వెళ్లి ఉగ్రదాడిలో మృతి చెందాడు.

    పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర కేబినెట్(Central Cabinet)​ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు మంత్రులు(Ministers) ఢిల్లీకి బయలు దేరారు. ఇప్పటికే ప్రధాని మోదీ(Prime Minister Modi) తన సౌదీ అరేబియా పర్యటను అర్ధంతరంగా ముగించుకొని తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఢిల్లీ ఎయిర్​పోర్టులోనే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​తో సమావేశం అయ్యారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. అయితే కేబినెట్​ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    More like this

    Nizamabad City | పౌర్ణమిని సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కళ్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన...

    OPS | పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలి

    అక్షరటుడే ఇందూరు: OPS | ఉద్యోగ ఉపాధ్యాయాలకు పాత పెన్షన్ విధానాన్ని(OPS) వర్తింపజేయాలని 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ పాత...

    BC Declaration | బీసీ డిక్లరేషన్​ సభను విజయవంతం చేయాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: BC Declaration | కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న బీసీ డిక్లరేషన్ సభను...