అక్షరటుడే, వెబ్డెస్క్ : IOCL Notification | భారతీయ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(Indian Oil Corporation Limited) పైప్లైన్స్ డివిజన్లో టెక్నికల్, నాన్టెక్నికల్ ట్రేడ్స్ కోసం అప్రెంటిస్ (Apprentice)లను నియమిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఐటీఐ, ఇంటర్ అర్హతలతో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే ఖాళీలు : 394.
పైప్లైన్ రీజియన్ల వారీగా..
ఈస్ట్రన్ రీజియన్ : 101
వెస్ట్రన్ రీజియన్ : 136
నార్తర్న్ రీజియన్ : 54
సదరన్ రీజియన్ : 40
సౌత్ ఈస్ట్రన్ రీజియన్ : 63
భర్తీ చేసే ట్రేడ్స్/విభాగాలు : మెకానికల్, ఎలక్ట్రికల్, టీ-ఐ (టెలికాం/ఐటీ), అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్.
విద్యార్హత : 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి : జనవరి 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 10.
ఎంపిక ప్రక్రియ : విద్యార్హతలు, వైద్య పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం https://iocl.com/ వెబ్సైట్లో సంప్రదించగలరు.