HomeUncategorizedAirports | తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

Airports | తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airports | దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు airports మళ్లీ తెరుచుకున్నాయి. ఆపరేషన్​ సిందూర్ operation sindoor​ అనంతరం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లోని 32 ఎయిర్​పోర్టులను కేంద్రం మూసివేసిన విషయం తెలిసిందే. మే 15 వరకు ఆయా ఎయిర్​పోర్టులు మూసి వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడంతో విమానాశ్రయాలను ప్రారంభించారు.

భారత్​, పాకిస్తాన్​ కాల్పుల విరమణ ceasefireకు అంగీకరించడంతో ఎయిర్​పోర్ట్​లను తెరుస్తున్నట్లు ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా AAI ప్రకటించింది. దీంతో వారం రోజులుగా మూసి ఉన్న విమానాశ్రయాల్లో మళ్లీ రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు ఎయిర్‌లైన్స్‌ సంస్థల వెబ్‌సైట్లు పరిశీలించాలని ఏఏఐ సూచించింది.

Airports | తెరుచుకున్న విమానాశ్రయాలు ఇవే..

ఉధంపూర్‌, అంబాలా, అమృత్‌సర్‌, అవంతీపురా, భటిండా, బికనేర్‌, భూజ్‌, చంఢీగఢ్‌, హల్వారా, హిండన్‌, జమ్ము, జామ్‌నగర్‌, జోథ్‌పూర్‌, జైసల్మేర్‌, కండాలా, కాంగ్రా, కేషోడ్‌, కిషన్‌గఢ్‌, కులు మనాలి, లేహ్‌, లూథియానా, ముంద్రా, నలియా, పటియాలా, పఠాన్‌కోట్‌, పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌, సర్సావా, షిమ్లా, శ్రీనగర్‌, తోయ్‌స్‌, ఉత్తర్‌లాయ్‌ ఎయిర్​పోర్టులు మళ్లీ తెరుచుకున్నాయి.