అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Liquor Tenders | జిల్లాలో మద్యం దుకాణాలకు (liquor shops) దరఖాస్తుల సమర్పణ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 102 మద్యం దుకాణాలకు సంబంధించి 262 దరఖాస్తులు వచ్చాయని మంగళవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి (Excise Superintendent Mallareddy) వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ స్టేషన్ (Nizamabad station) పరిధిలో మొత్తం 36 వైన్ దుకాణాలకు 100 దరఖాస్తులు వచ్చాయన్నారు. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్‌లకు 44 దరఖాస్తులు సమర్పించారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ దుకాణాలకు 61 దరఖాస్తులు వచ్చాయి. అలాగే భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్‌లకు 32 దరఖాస్తులు వచ్చాయి. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్‌లకు 25 దరఖాస్తులు వచ్చాయని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.