HomeUncategorizedRafale Jets | మ‌రో 26 రాఫెల్ ఫైట‌ర్ జెట్లు.. రూ.63 వేల కోట్ల‌తో ఫ్రాన్స్‌తో...

Rafale Jets | మ‌రో 26 రాఫెల్ ఫైట‌ర్ జెట్లు.. రూ.63 వేల కోట్ల‌తో ఫ్రాన్స్‌తో భార‌త్ స‌రికొత్త డీల్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rafale Jets | పాకిస్తాన్‌తో ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతోన్న వేళ ఇండియా అధునాత‌న ఆయుధ స‌మీక‌ర‌ణ‌పై దృష్టి సారించింది. మ‌రో 26 రాఫెల్‌-ఎం ఫైట‌ర్ జెట్ల(Rafale-M fighter jets) కొనుగోలుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఫ్రాన్స్‌తో రూ.63 వేల కోట్ల భారీ ఒప్పందం కుద‌ర్చుకోనుంది.

26 రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల రాక‌తో భారత నావికాదళ శ‌క్తి స‌రికొత్త శిఖరాలకు చేర‌నుంది. ఏప్రిల్ 9న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో 26 రాఫెల్-ఎం జెట్ల కొనుగోలు కోసం ఆమోదం తెలిపారు. దీంతో తాజాగా ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకోనున్నారు. రాఫెల్-ఎమ్ జెట్లు నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి పనిచేస్తాయి. మన వ‌ద్ద ఉన్న మిగ్ 29 కే విమానాల స్థానంలో కొత్త రాఫెల్ జెట్లు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Rafale Jets | సముద్రంపై సంపూర్ణ ఆధిప‌త్యం

మ‌న విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్(INS Vikrant), ఐఎన్ఎస్ విక్రమాదిత్య(INS Vikramaditya) ద్వారా ఆకాశంలో ఆధిపత్యం చెలాయించనున్న ఈ అధునాతన జెట్లు హిందూ మహాసముద్రంలో భార‌త్‌కు ఎన‌లేని ప‌ట్టు క‌లిగిస్తాయి. ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎదుర‌య్యే ప్ర‌మాదాల‌ను నివారించ‌డంతో పాటు హిందూ స‌ముద్రంపై పూర్తిగా ఆధిప‌త్యం క‌ల్పిస్తాయి. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్(Indian Air Force) వ‌ద్ద ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కొత్తవి కొనుగోలు చేయ‌నుండ‌డంతో వీటి సంఖ్య 62కి చేర‌నుంది. ఇది దేశంలోని 4.5 తరం యుద్ధ విమానాల సముదాయాన్ని గణనీయంగా పెంచుతుంది.

Rafale Jets | అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన ఫైట‌ర్ జెట్లు

ప్రపంచంలోనే అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన ఫైట‌ర్ జెట్ల‌లో రాఫెల్-ఎమ్(Rafale-M) ప్రసిద్ధి గాంచిన‌వి. అధునాత‌న టెక్నాల‌జీతో ప్ర‌త్య‌ర్థుల‌కు చిక్క‌కుండా టార్గెట్ల‌ను ఛేదించ‌డంలో వీటికి సాటి లేదు. ఫ్రాన్స్ నేవి(France Navy) మాత్ర‌మే వీటిని నిర్వ‌హిస్తోంది. మ‌రే దేశం వ‌ద్ద ఇవి లేవు. తాజా ఒప్పందంలో 22 సింగిల్-సీటర్ రాఫెల్-ఎమ్ జెట్లు. నాలుగు ట్విన్-సీటర్ ట్రైనర్లు(Twin-seater trainers) ఉన్నాయి. నేడో రేపో రెండు దేశాల మ‌ధ్య కొనుగోలు ఒప్పందం జ‌రుగ‌నుండ‌గా, 2031 నాటికి వీటి డెలివ‌రీలు పూర్త‌వుతాయని అంచ‌నా వేస్తున్నారు.

Rafale Jets | ఫ్రాన్స్‌తో వ్యూహాత్మ‌క సంబంధాలు..

భార‌త్ ఇప్ప‌టికే ఫ్రాన్స్‌(France)తో కీల‌క‌ సంబంధాలు క‌లిగి ఉంది. తాజా ఒప్పందంతో రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు మ‌రింత బ‌లోపేతం కానున్నాయి. భ‌విష్యత్తులో రెండు దేశాల మ‌ధ్య టెక్నాల‌జీ మార్పిడితో పాటు స్థానికంగానే ఉత్ప‌త్తి చేసే అవ‌కాశ‌ముంది. తాజా కొనుగోలు ఒప్పందంపై రక్షణ కార్యదర్శి, ఫ్రెంచ్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సభ్యులు సంతకం చేస్తారు. ఈ ఏరోస్పేస్ సంస్థ భారత స్వావలంబన లక్ష్యాలకు మద్దతు ఇచ్చే ఆస్ట్రా వంటి భారతీయ క్షిపణులను అనుసంధానించాలని భావిస్తున్నారు.