అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలోని (Odisha) మల్కన్‌గిరి జిల్లాలో 22 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు.
ఏవోబీలో మావోయిస్ట్ పార్టీకి (Maoist party) షాక్ తగిలింది. ఒడిశా డీజీపీ (Odisha DGP) ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కేరళపాల్ కమాండర్లు కూడా ఉన్నట్లు సమాచారం. డోర్నపాల్ LOSకు చెందిన కీలక కమాండర్లు, కేరళపాల్, జగర్గుండ ఏరియా కమిటీలకు చెందిన 19 మంది మావోలు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.2.18 కోట్ల రివార్డు ఉంది.
Maoists Surrender | ఆయుధాలు అప్పగింత
దక్షిణ ఒడిశాను నక్సల్ హింస నుంచి విముక్తి చేసే దిశగా ఒక ముందడుగు వేస్తూ మల్కన్‌గిరి జిల్లా పోలీసులు మావోయిస్టులతో చర్చలు జరిపి లొంగిపోయేలా చేశారు. దీంతో ఏవోబీలో మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోయిన వారిలో ఒకరు డివిజనల్ కమిటీ సభ్యుడు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) ఉన్నారు. ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానీయా (Odisha DGP Yogesh Bahadur Khurania) సమక్షంలో వారు తమ ఆయుధాలను అప్పగించారు. క్యాడర్లు తొమ్మిది తుపాకులు, వివిధ క్యాలిబర్‌ల 150 తూటాలు, 9 మ్యాగజైన్లు, 20 కిలోల పేలుడు పదార్థాలు, 13 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు, జిలెటిన్ స్టిక్స్, కోడెక్స్ వైర్, మావోయిస్టు సాహిత్యం మరియు ఇతర వస్తువులను అప్పగించారు. లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం చేశారు.
Maoists Surrender | ప్రభుత్వ చర్యలతో..
ఆపరేషన్ కగార్తో బలగాలు అడవుల్లోకి చొచ్చుకువస్తున్నాయి. దీంతో మావోయిస్టులపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు మావోయిస్టులు లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. సిద్ధాంతంపై నిరాశ, నాయకత్వ లోపం, స్థానిక మద్దతు లేకపోవడం, ఒడిశా ప్రభుత్వం లొంగుబాటు-పునరావాస విధానం వంటి కార్యక్రమాలతో మావోయిస్టులు లొంగిపోయారు.