అక్షరటుడే, కామారెడ్డి: Maize purchasing centers | జిల్లాలో 18 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జిల్లా మార్క్ఫెడ్ అధికారి మహేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా (PACS) జిల్లాలోని బాన్సువాడ (Banswada) మండలం హన్మాజీపేట, బిచ్కుంద మండలం పుల్కల్, పిట్లం మండల కేంద్రం, భిక్కనూరు మండలం అంతంపల్లి, బస్వాపూర్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
అలాగే మాచారెడ్డి మండలంలోని సోమార్ పేట, రాజంపేట మండలం రాజంపేట, ఆర్గొండ, కొండాపూర్, గాంధారి మండలంలోని ముథోలి, గాంధారి, సదాశివనగర్ మండలంలోని భూంపల్లి, దగ్గి, తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్, తాడ్వాయి, దేమికలాన్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు మొక్కజొన్న పంటను 14శాతం తేమ ఉండేలా ఎండబెట్టాలని సూచించారు. క్వింటాలు మొక్కజొన్నకు రూ.2,400 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని చెప్పారు.