అక్షరటుడే, హైదరాబాద్: Telangana govt :తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business) విధానాన్ని ప్రోత్సహించేందుకు అడుగులు వేసింది.
రాష్ట్రంలోని వాణిజ్య సంస్థలకు (షాపులను మినహాయించి) ఉద్యోగుల (employees) పని సమయానికి మినహాయింపులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు మంగళవారం(జులై 8, 2025) నుంచి అమలులోకి రానున్నాయి.
Telangana govt : తెలంగాణ సర్కారు తాజా నిర్ణయం ప్రకారం..
రోజుకు ఉద్యోగులు గరిష్ఠంగా 10 గంటలు, వారానికి 48 గంటల వరకు పనిచేయొచ్చు. కాగా, ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన భద్రతా ప్రమాణాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం..
రోజుకు గరిష్ఠంగా 10 గంటలు మాత్రమే పని.
వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే, ఓవర్‌టైమ్ వేతనం తప్పనిసరి ఇవ్వాలి.
6 గంటలకుపైగా పని చేసిన వారికి కనీసం 30 నిమిషాల విరామం తప్పనిసరి కేటాయించాలి.
రోజువారీ మొత్తం పని సమయం 12 గంటలను మించకూడదు.
ఓవర్ టైమ్ విషయానికి వస్తే.. ప్రతి త్రైమాసికానికి గరిష్ఠంగా 144 గంటలు మాత్రమే అనుమతి.
ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే మినహాయింపును రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
#Hyderabad—#Telangana notifies 10-hour daily work rule, keeps weekly limit at 48 hours
Telangana Govt allows employees in commercial establishments (except shops) to work 10 hours per day, capped at 48 hours per week, under the Shops & Establishments Act, 1988.#Telangana… pic.twitter.com/OjKOkwoQrf