అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YSRCP chief, former CM YS Jaganmohan Reddy) ధ్వజమెత్తారు. ఒంటిమిట్ట (Ontimitta), పులివెందుల (Pulivendula) జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అరాచకాలు జరిగాయంటూ మంగళవారం (ఆగస్టు 12) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రాష్ట్రంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలోని ఒక ZPTC సీటును లాక్కునేందుకు అరాచకం చేశారని అన్నారు. రాజంపేటలోని ఒంటిమిట్ట ZPTC సీటును బలవంతంగా తీసుకునేందుకు ఒక గూండా మాదిరిగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్..
రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. సీఎంగా ఆయనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకున్నారని, పోలీసుల సాయంతో ఈ ఉప ఎన్నికలను తీవ్రవాదుల మాదిరి హైజాక్ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
YS Jagan | ఇది నిజంగా ఒక బ్లాక్ డే..
జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే అని పేర్కొన్నారు. ఒంటిమిట్ట (Ontimitta), పులివెందుల (Pulivendula) ZPTC ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఉప ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.