అక్షరటుడే,బోధన్ : Renjal | రెంజల్ మండల జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కో కన్వీనర్ నీరడి రవి (Co-Convenor Neeradi Ravi) డిమాండ్ చేశారు. ఈ మేరకు రెంజల్ ఎంపీడీవో కమలాకర్‌కు (MPDO Kamalakar) వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలోని (Bodhan Constituency) రెంజల్ మండలం ఏర్పడి నేటికి సుమారు 40 ఏళ్లు కావస్తోందన్నారు. అయినా ఇప్పటివరకు ఎంపీపీ, జడ్పీటీసీ (ZPTC) స్థానాలను ఎస్సీ, ఎస్టీలకు కేటాయించలేదన్నారు.
జనాభా దామాషా ప్రకారం రెంజల్ మండలంలో ఎస్సీ, ఎస్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు రొటేషన్ ప్రకారం కల్పిస్తున్నప్పటికీ రెంజల్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా స్థానాలను ఎస్సీ, ఎస్టీలకే కేటాయించాలని లేనిపక్షంలో దళిత, బహుజన, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాందరే రాములు, రాము, సందీప్ తదితరులు పాల్గొన్నారు.