ePaper
More
    Homeబిజినెస్​Zomato | ఇదో కొత్త బాదుడా.. దూరాన్ని బ‌ట్టి డెలివ‌రీ ఛార్జ్ వ‌సూలు చేయ‌నున్న జొమాటో

    Zomato | ఇదో కొత్త బాదుడా.. దూరాన్ని బ‌ట్టి డెలివ‌రీ ఛార్జ్ వ‌సూలు చేయ‌నున్న జొమాటో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ సేవ జొమాటో (Zomato) తన వినియోగదారులకు ఊహించ‌ని షాకిచ్చింది. నష్టాలను తగ్గించే దిశగా తీసుకొచ్చిన చర్యలో భాగంగా, కొత్త విధమైన ఛార్జీలను అమలు చేయడం ప్రారంభించింది.

    కొత్తగా ‘లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'(Long distance service fee)ను ప్రవేశపెట్టింది. అంటే, ఇకపై మీరు దూరంగా ఉన్న హోటల్ లేదా రెస్టారెంట్ నుంచి ఆహారం ఆర్డర్ చేస్తే, ఆ దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీదట 4 కిలోమీటర్లు దాటితే.. రెస్టారెంట్, డెలివరీ అడ్రస్ మధ్య దూరం 4 కిలోమీటర్లు పైబడి ఉంటే ఈ కొత్త ఛార్జీ వర్తిస్తుంది అని తెలిపింది. 4 నుంచి 6 కిలోమీటర్లకు అయితే.. అప్పుడు ఆర్డర్ విలువ రూ. 150 దాటితే, కస్టమర్ల(Customers) నుంచి రూ.15 వసూలు చేయనున్నారు.

    Zomato | బాదుడే బాదుడు..

    ఇక 6 కిలోమీటర్లు దాటితే అప్పుడు ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా, నగరాన్ని బట్టి సర్వీస్ ఛార్జీ(Service Charge) రూ. 25 నుంచి రూ. 35 వరకు ఉంటుంది. కొవిడ్ వ్యాప్తికి ముందు, జొమాటో 4 నుంచి 5 కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి డెలివరీ ఛార్జీలు వసూలు చేసేది కాదు. మహమ్మారి సమయంలో చాలా రెస్టారెంట్లు (Restaurants) తాత్కాలికంగా మూతపడినప్పుడు, జొమాటో డెలివరీ పరిధిని 15 కిలోమీటర్ల వరకు పెంచింది. ఆ తర్వాత క్రమంగా ఆ పరిధిని తగ్గించుకుంటూ వచ్చి, డెలివరీ ఫీజులను(Delivery Charges) మొదలుపెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.

    మహమ్మారి సమయంలో అనేక రెస్టారెంట్లు(Restaurents) తాత్కాలికంగా మూతబడిన కారణంగా, డెలివరీ పరిధిని 15 కిలోమీటర్లకు పెంచింది. తర్వాత ఇది తగ్గుతూ, చివరికి ఇప్పుడు దూరాన్ని Distance బట్టి ఫీజు వసూలు చేసే విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది.

    అయితే, రెస్టారెంట్ భాగస్వాములకు ఆర్డర్ విలువకు సంబంధించిన డిస్టెన్స్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీలు 30 శాతం దాటకూడదని జొమాటో సూచనలు ఇచ్చింది. కొత్త ఫీజుల నేపథ్యంలోనే, ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో జొమాటో షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడే(Intra Day)లో ఒక దశలో 5 శాతానికిపైగా పెరిగిన షేరు రూ.240.70 వద్ద గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇక చివరకు 3.63 శాతం లాభంతో రూ.237.34 వద్ద స్థిరపడింది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ.246.94 కాగా.. కనిష్ట ధర రూ.209.86 గా ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.15 లక్షల కోట్లుగా ఉంది.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...