అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్ సమయంలో స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్స్ (Food Delivery Apps) ఇప్పుడు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
తాజాగా జొమాటో తమ ప్లాట్‌ఫామ్ ఫీజును (Platform Fees) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సీజన్‌ను టార్గెట్ చేస్తూ, జొమాటో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10 నుంచి రూ.12కి పెంచింది. 2023 ఆగస్టులో ప్రారంభించిన ఈ ఫీజు వ్యవస్థను అప్పట్లో రూ.2గా ప్రవేశపెట్టగా, ఇప్పుడు వరుసగా పెరిగి రూ.12కు చేరింది. కంపెనీ ప్రకారం, ఈ పెంపు అన్ని నగరాల్లోని కస్టమర్లకు వర్తిస్తుంది.
Zomato | పెరుగుతున్న ఖర్చులు.. తగ్గిన లాభాలు
పండుగల సమయంలో (Festive Time) ఆర్డర్ల సంఖ్య భారీగా పెరగడం, డెలివరీ బృందానికి అధిక చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని సమాచారం. మరోవైపు, జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌కు 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర లాభం 90% తగ్గడం కూడా ఈ నిర్ణయంలో ప్రభావం చూపినట్లు అంచనాలు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.253 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ, ఈ ఏడాది అదే కాలంలో కేవలం రూ.25 కోట్ల లాభంతోనే సరిపెట్టుకుంది. ఆదాయం 70% పెరిగినా, నికర లాభం భారీగా తగ్గింది. ఇక జొమాటో (Zomato) మాత్రమే కాదు, స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఎంపిక చేసిన నగరాల్లో ప్రతి ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.12 నుంచి రూ.14కి పెంచినట్టు సమాచారం.
ఈ పెంపుతో వినియోగదారులపై ఆర్డర్ ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రోజుకు లక్షల సంఖ్యలో ఆర్డర్లు తీసుకునే ఈ రెండు దిగ్గజ సంస్థలు ప్లాట్‌ఫామ్ ఫీజు ద్వారానే గణనీయమైన ఆదాయాన్ని పొందనున్నాయి. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఇకపై జాగ్రత్త! ప్లాట్‌ఫామ్ ఫీజుతో పాటు డెలివరీ ఛార్జీలు (Delivery Charges), ట్యాక్స్‌లు కలిపి మొత్త ఖర్చు ఎంత అవుతుందో గమనించడం అవసరం. పండుగల వేళ తక్కువ ఖర్చుతో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఆఫర్లు, కూపన్లపై ఓ లుక్కేయడం మాత్రం మర్చిపోవద్దు.