అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB New Bowler | ఐపీఎల్ 2025 సీజన్ ప్లేఆఫ్స్ ముంగిట ఆర్‌సీబీలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్ లుంగిఎంగిడి (lungi ngidi) స్థానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీతో(zimbabwean fast bowler blessing muzarbani) భర్తీ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్(WTC final) కోసం లుంగిఎంగిడి ఆర్‌సీబీని వదిలి సౌతాఫ్రికాకు (southafrica) వెళ్లనున్నాడు. మే26 తర్వాత అతను జట్టుకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే అతని స్థానాన్ని ముజర్బానీతో ఆర్‌సీబీ భర్తీ చేసింది.
ఈ సీజన్‌లో లుంగి ఎంగిడి ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీశాడు. జోష్ హజెల్‌వుడ్ (josh hazelwood) స్థానంలో తుది జట్టులోకి వచ్చిన అతను ఒకే మ్యాచ్ ఆడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటికే ఆర్‌సీబీ ప్లే ఆఫ్ష్ చేరిన విషయం తెలిసిందే. హజెల్‌వుడ్ ప్లేఆఫ్స్‌కు(play-off) అందుబాటులో వస్తాడని సమాచారం ఇవ్వడంతో అతని ప్లేస్‌లో మరే ఆటగాడిని తీసుకోలేదు. బ్లెస్సింగ్ ముజర్బానీ (blessing muzarbani) ఇప్పటివరకు మొత్తం 70 టీ20 మ్యాచ్‌లు ఆడి 7.02 ఎకానమీతో 78 వికెట్లు పడగొట్టాడు. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), లక్నో సూపర్ జెయింట్స్‌తో (lucknow super giants) ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ఆర్‌సీబీ టాప్-2 ప్లేస్ ఖరారు కానుంది.
ఇక కేకేఆర్ రోవ్‌మన్ పావెల్(roman powel) స్థానంలో మధ్యప్రదేశ్ స్పిన్ బౌలర్ శివం శుక్లాను(shivam shukla) తీసుకుంది. ఇప్పటికే కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆ జట్టు ఆఖరి మ్యాచ్ ఆడనుంది.