అక్షరటుడే బాన్సువాడ: Zaheerabad MP Suresh Shetkar | ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ పరామర్శించారు. బీర్కూరు Birkur మండలం దామరంచ Damarancha గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఇక్బాల్ కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఎంపీ షెట్కార్ MP Shetkar బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు ద్రోణవల్లి సతీష్, కమ్మ సత్యనారాయణ, మోసాని శ్రీనివాసరెడ్డి, కమలాకర్ రెడ్డి, మంత్రి గణేష్ తదితరులు ఉన్నారు.