అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ED Notice | ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) దూకుడు పెంచింది. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు శిఖర్, సురేశ్ రైనాను విచారించిన ఈడీ.. ఇప్పుడు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది.
యువరాజ్‌సింగ్(Yuvraj Singh), రాబిన్ ఉతప్పలను విచారణకు రావాలని మంళవారం నోటీసులు పంపించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులు ప్రశ్నించడానికి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న రాబిన్ ఉతప్ప(Robin Uthappa)ను సెప్టెంబర్ 23న యువరాజ్‌ను విచారణకు రావాలని సూచించింది.
ED Notice | వాంగ్మూలాల సేకరణ..
పలువురు క్రికెటర్లు, సినీ తారలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(Online Betting App)ల తరఫున ప్రచారం చేశారు. అయితే, ఆన్‌లైన్ బిట్టింగ్ యాప్‌ల మూలంగా ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మరోవైపు, బెట్టింగ్ యాప్‌ల నేపథ్యంలో భారీగా మనీలాండరింగ్(Money Laundering) జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులను ప్రశ్నించింది. తాజాగా మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.