ePaper
More
    Homeక్రీడలుDhoni Fan | ఈ ఐదేళ్ల బుడ‌త‌డు ధోని వీరాభిమాని.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్మురేపుతున్నాడుగా.!

    Dhoni Fan | ఈ ఐదేళ్ల బుడ‌త‌డు ధోని వీరాభిమాని.. హెలికాప్టర్ షాట్స్‌తో దుమ్మురేపుతున్నాడుగా.!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dhoni Fan | స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడే పిల్లలుంటారు. కానీ కొంతమంది చిన్నారులు మాత్రం ఆటను చిన్న వయసులోనే సీరియస్‌గా తీసుకుని, తమ టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అహ్మదాబాద్‌కు చెందిన యువరాజ్ గాంధీ (Yuvraj Gandhi) అనే ఐదేళ్ల పిల్లవాడు ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను ఆసక్తిగా చూసే యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీకి (Mahendra singh Dhoni) వీరాభిమాని. ఈ చిన్నోడు ‘ధోనీ ఫ్యాన్’ అని మాత్రమే కాదు, నిజంగా ధోనీ మాదిరిగానే స్టైలిష్‌ షాట్లు ఆడడంలో తనదైన ముద్ర వేశాడు.

    Dhoni Fan | అకాడమీలో ప్రత్యేక సాధన

    తాజాగా ఈ బుడ్డోడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇందులో యువరాజ్ నెట్ సెషన్స్‌లో అన్ని వైపులా షాట్లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. కవర్ డ్రైవ్స్ (Cover Drives), స్ట్రెయిట్ షాట్లు, ఆఫ్ సైడ్ షాట్లు, ఫుట్ వర్క్ అన్నిట్లోనూ నైపుణ్యాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా హెలికాప్టర్ షాట్ కొట్టిన తీరు చూసి, ధోనీ (Ms Dhoni)పై ఉన్న‌ అభిమానం ఎంతగా ప్రభావం చూపిందో అర్థమవుతుంది. యువరాజ్ బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మార‌డంతో ఇది చూసిన వారంతా.. “ఔరా.. ఈ పసికందు ఎలా ఆడుతున్నాడో చూశారా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. “లిటిల్ ధోనీ”, “ఫ్యూచర్ సూపర్ స్టార్”, “బాల సచిన్ లా ఉన్నాడుగా” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    ఇప్పుడు ఈ చిన్నారికి ఆటపై ఉన్న ఆసక్తి, కఠిన సాధన చూస్తుంటే భవిష్యత్తులో టీమ్ ఇండియాలో చోటు ద‌క్కించుకుంటాడేమోన‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. కాగా.. మ‌హేంద్ర సింగ్ ధోని ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో IPL మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు. ధోనిని చిన్న బుడ‌త‌డి నుండి పండు ముస‌లి వాళ్ల వ‌ర‌కు ఎంత‌గానో అభిమానిస్తారు.

    Latest articles

    NHAI Notification | డిగ్రీలో ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHAI Notification | పలు పోస్టుల భర్తీ కోసం నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌...

    Pocharam Bhaskar Reddy | మీడియా లేనిదే ప్రపంచం లేదు.. పోచారం భాస్కర్ రెడ్డి

    అక్షరటుడే, కోటగిరి: Pocharam Bhaskar Reddy | మీడియా(Media) లేనిదే ప్రపంచం లేదని ఉమ్మడి జిల్లా డీసీసీబీ మాజీ...

    Roja | జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఎమ్మెల్యే వ్యాఖ్యల వివాదం… రోజా గట్టి కౌంటర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roja | టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. Ntr)పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు,...

    Nizamsagar Project | రేపు నిజాంసాగర్​ గేట్లు ఎత్తే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. 50వేల క్యూసెక్కులకు పైగా...

    More like this